యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని లాంచ్ చేసిన గూగుల్ పే

యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని లాంచ్ చేసిన గూగుల్ పే


ఎన్పీసీఐ ఇటీవల ప్రకటించిన యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని గూగుల్ పే తీసుకొచ్చింది. దీంతో యూపీఐని ఇతరులతో పంచుకోవచ్చు.


గూగుల్ కు చెందిన చెల్లింపు సేవల సంస్థ గూగుల్ పే (Google pay) యూపీఐ సర్కిల్ (UPI Circle) ఫీచర్ ను ప్రారంభించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో తమ యూపీఐ అకౌంట్ను వాడుకునే సదుపాయం కల్పిస్తోంది. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా దీన్ని వాడుకోవచ్చు. ముంబయి వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఫిన్టిక్ ఫెస్ట్ 2024లో భాగంగా యూపీఐ సర్కిల్తో పాటు మరికొ ఫీచర్లను తీసుకొచ్చింది.


యూపీఐ సర్కిల్ కోసం గూగుల్ పే ఎన్పీసీఐతో జట్టు కట్టింది. ఈ సదుపాయం ద్వారా ఇతరులకు పాక్షికంగా లేదా పూర్తి డెలిగేషన్ ఇవ్వొచ్చు. ఇదే వేదికపై ఈ-రూపీ సేవలను కూడా ఆవిష్కరించింది. రూపే కార్డులు కలిగి ఉన్న వారికి ట్యాప్ అండ్ పే పేమెంట్స్ సదుపాయం కూడా ప్రకటించింది. దీని ద్వారా రూపే కార్డు హోల్డర్లు మొబైల్ ద్వారా ట్యాప్ చేసి పే చేయొచ్చు. అలాగే, యూపీఐ లైట్లో ఆటోపే ఆప్షన్ను కూడా తీసుకొచ్చింది. 9



యూపీఐ సర్కిల్ ఎలా పని చేస్తుంది?

ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు తమ మొబైల్లో యూపీఐ సేవలను వాడుకునే వీలుంది. అయితే, ఎవరి యూపీఐని వారే వాడుకోవాలి. వేరొకరు వాడేందుకు అనుమతి లేదు. కొత్తగా తీసుకొచ్చిన యూపీఐ సర్కిల్లో అది సాధ్యం కానుంది. ప్రైమరీ యూపీఐ అకౌంట్ను కుటుంబ సభ్యులు, పరిచయం ఉన్న వ్యక్తులతో పంచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. అంటే ఒకరి బ్యాంక్ అకౌంట్ను వేరొకరు వినియోగించి లావాదేవీలు జరపొచ్చన్నమాట. గరిష్ఠంగా ఐదుగురితో యూపీఐని పంచుకోవచ్చు.

No comments:

Post a Comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now