Nuziveedu IIIT issue Removal of Director

Nuziveedu IIIT issue Removal of Director Minister Lokesh Fires on Nuziveedu Triple IT Incident - Removal of Director - Lokesh on Nuziveedu IIIT issue నూజివీడు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పై వేటు.. విద్యార్థుల అస్వస్థతపై.. మంత్రి లోకేశ్ ఆగ్రహం


నూజివీడు ట్రిపుల్ఎటీలో కలుషితాహారం తిని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఉదంతాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా పరిగణించారు.


విద్యార్థుల ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రిపుల్ఎటీ డైరెక్టర్ చంద్రశేఖర్ను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ నిట్ ఆచార్యుడైన చంద్రశేఖర్ను గత ప్రభుత్వం ఇక్కడ డైరెక్టర్గా నియమించింది. మరోపక్క, ట్రిపుల్ఎటీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పాదుకొల్పే చర్యల్లో భాగంగా పర్యవేక్షణకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావు, ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వీ ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆహార నాణ్యత, కొన్ని సున్నితమైన అంశాలపై ఫిర్యాదుల స్వీకరణ, ఇతరత్రా సమస్యల తక్షణ పరిష్కారానికి ఈ కమిటీ ప్రణాళికను రూపొందించాలని మంత్రి లోకేశ్ సూచించారు.


త్రిసభ్య కమిటీ బాధ్యతలివే..


• విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, మెస్లో పరిశుభ్రత చర్యల కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొటోకాల్ అమలు, వసతిగృహాల్లో మెరుగైన ప్రమాణాల అమలుకు చర్యలు తీసుకోవడాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది.


• ట్రిపుల్ఎటీ అవసరాల మేరకు చిన్నచిన్న మరమ్మతులు చేయడం, లైంగిక వేధింపులపై ఫిర్యాదుల పరిష్కారానికి అంతర్గత కమిటీ వేయడం, ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా విచారణ చేపట్టి సత్వరం చర్యలు తీసుకోవడం, ప్రతి డిపార్టుమెంట్ స్థాయిలో తగిన యంత్రాంగాన్ని ఏర్పాటుచేసి డ్రగ్, పొగాకు రహితంగా తీర్చిదిద్దడంపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది.


• విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించడం, జీవన నైపుణ్యానికి చర్యలు తీసుకోవడం, కళాశాల వెల్నెస్ టీమ్ ఏర్పాటును కమిటీ పరిశీలిస్తుంది.


వెల్నెస్ టీమ్ లో విద్యార్థి సంక్షేమ డీన్, ఇద్దరు సీనియర్ అధ్యాపకులు సభ్యులుగా, ప్రతి విభాగం నుంచి విద్యార్థి మానిటర్లు, తల్లిదండ్రులు ప్రతినిధులుగా ఉంటారు.

No comments:

Post a Comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now