The minimum marriage age for women in Himachal Pradesh

The minimum marriage age for women in Himachal Pradesh is now 21 years.  It is a crime to marry women below the prescribed age.


హిమాచల్ ప్రదేశ్ లో ఇక పై మహిళల కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది.


లింగ సమానత్వం, ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు మహిళ కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లుకు బుధవారం(28.08.2024)న ఆమోదం తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీ బాల్య వివాహాల నిషేధాన్ని (హిమాచల్ ప్రదేశ్ సవరణ బిల్లు 2024) వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.


ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం- 2006 స్థానంలో బాల్య వివాహాల (హిమాచల్ ప్రదేశ్) నిషేధ సవరణ-2024 చట్టం తీసుకొచ్చారు.


రాష్ట్రంలో బాల్య వివాహ చట్టం 2006, సంబంధిత చట్టాలను సవరించి, బాలికల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే ప్రతిపాదన చేశారు.


2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు 18 ఏళ్లు కాగా, పురుషుల కనీస వివాహ వయసు 21 ఏళ్లుగా ఉంది.

No comments:

Post a Comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now