AP State Fake Universities declared by UGC: ఏపి రాష్ట్రంలో రెండు నకిలీ విశ్వవిద్యాలయాలు - యూజీసీ ప్రకటన
దేశవ్యాప్తంగా 21 నకిలీ వర్సిటీలు ఉన్నట్లు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ప్రకటించింది.
వాటిలో ఏపీకి సంబంధించి గుంటూరు కాకుమానివారితోటలోని క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ విశ్వవిద్యాలయం, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా ఉన్నాయి.
నకిలీ వర్సిటీలకు డిగ్రీలు ప్రదానం చేసే అధికారం లేదు. ఈ విద్యా సంస్థలు ఇచ్చిన ధ్రువపత్రాలు చెల్లుబాటు కావు.
యూజీసీ నకిలీ విశ్వవిద్యాలయాలను ప్రకటిస్తున్నా, ఉన్నత విద్యాశాఖ ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కనీసం వాటి యజమానులను పిలిచి మాట్లాడిన దాఖలాలే లేవు.
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో తమిళనాడు, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కొన్ని వర్సిటీల పేర్లతో కోర్సులు నిర్వహిస్తున్నారు.
వన్ సిట్టింగ్లోనే డిగ్రీ ఇస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు.
నకిలీ వర్సిటీల గురించి తెలియని చాలామంది విద్యార్థులు వాటిల్లో ప్రవేశాలు పొందుతున్నారు. తీరా చదివిన తర్వాత ఆ ధ్రువపత్రాలు చెల్లవని చెబుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
ఇప్పటికైనా ఉన్నత విద్యా శాఖ, ఉన్నత విద్యా మండలి నకిలీ విశ్వవిద్యాలయాల పై దృష్టిపెట్టాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
No comments:
Post a Comment