AP MDM New Menu 2024 మారనున్న మధ్యాహ్న భోజనం ఆహార మెనూ
ఒక్కో ప్రాంతానికి ఒక్కో మెనూ
ఇకపై రాష్ట్రంలో నాలుగు రకాల మెనూలు!
ప్రాథమికంగా నిర్ణయించిన అధికారులు.
డిసెంబరు 1 నుంచి కొత్త మెనూలు అమల్లోకి వచ్చే అవకాశo
పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మారిపోనుంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం ఒక్కటే మెనూ అమల్లో ఉండగా.. వేర్వేరు ప్రాంతాల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఇకపై నాలుగు రకాల మెనూలు అమలు చేయాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. తొలుత జిల్లాకో మెనూ అమలు చేయాలని భావించినప్పటికీ, కొన్ని జిల్లాల్లో ఒకే విధమైన ఆహారపు అలవాట్లు ఉన్నందున జోన్‌కు ఒక విధమైన ఆహారం పెట్టనున్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకంపై సోమవారం మంగళగిరిలో రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ జరిగింది. ప్రభుత్వ సూచనల మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు ఇష్టపడే, పౌష్టికాహారం ఉండే భోజన మెనూలను తయారు చేశారు. వాటిని వర్క్‌షాప్ స్టాల్స్‌లో ప్రదర్శించారు. మఽధ్యాహ్న భోజనంపై తుది నిర్ణయానికి జాతీయ స్థాయి నిపుణులతో పాఠశాల విద్యాశాఖ ఒక కమిటీ ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆ కమిటీతో కలిసి స్టాల్స్‌ను పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో ఉడికించిన గుడ్లు తినేందుకు విద్యార్థులు ఇష్టపడట్లేదని వర్క్‌షా్‌పలో అధికారుల దృష్టికొచ్చింది. దీంతో గుడ్లనే ప్రత్యామ్నాయ పద్ధతిలో పెట్టాలని నిర్ణయించారు. అలాగే హాట్ పొంగల్‌ను పూర్తిగా తొలగించనున్నారు. ఈ మెనూలను మరోసారి ప్రభుత్వం ముందుంచి ఖరారు చేయనున్నారు. డిసెంబరు 1 నుంచి కొత్త మెనూలు అమల్లోకి వచ్చే అవకాశముంది.
🍛🍲 ఏటా రూ.2 వేల కోట్ల ఖర్చు:
వర్క్‌షాప్ లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకానికి ఏటా రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తుంటే, కేంద్రం తన వాటా కింద రూ.400 కోట్లు ఇస్తోందన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలో వేర్వేరు ఆహారపు అలవాట్లు ఉన్నాయని, ఆయా ప్రాంతాల్లో కూరగాయల లభ్యత కూడా వేరుగా ఉందని, అందుకు అనుగుణంగా మెనూలు తయారు చేస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం విద్యార్థుల డ్రాపౌట్ రేటును తగ్గించేందుకు ఉపయోగపడుతుందన్నారు.
No comments:
Post a Comment