Aadhaar Free Update

Aadhaar Free Update ఉచిత అప్ డేట్.. గడువు మరోసారి పొడిగింపు


ఆధార్ (Adhaar) వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు నేటితో ముగియనున్న వేళ భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును మరోమారు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఉడాయ్ ఎక్స్లో పోస్ట్ చేసింది. 2024 డిసెంబర్ 14 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీంతో ఆధార్ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోండి.


యూఐడీఏఐ (UIDAI) నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం ఆయా రుజువు పత్రాలు సమర్పించాలి. ఉచిత సేవలు 'మై ఆధార్' పోర్టల్ ద్వారా మాత్రమే లభిస్తాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్డేట్ చేసుకోవచ్చు.

No comments:

Post a Comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now