NMMS 2023 Merit Cards Download NMMS Merit Cards 2023 Download for NSP Portal registration
Due to the delay in receiving the merit cards of the selected students in the National Merit Examination (NMMS) conducted on 03-12-2023 to the students, this year web merit cards are made available on the website of the Office of Government Examinations www.bse.ap.gov.in . So the selected students should immediately download their merit card from the website and check whether their details like name, date of birth, father or mother name etc. are same as on their Aadhaar card (without even a single letter difference) and check their scholarship portal of Ministry of Education, New Delhi. Applications should be submitted on www.scholarships.gov.in before 31st August this year and approved through respective school nodal officer and district nodal officer logins. The printed merit cards will soon be sent to the office of the concerned District Education Officer. Student's Name, Father's Name, Date of Birth should be in Aadhaar Card only as printed in Merit Card. Students whose details do not match should immediately submit the Aadhaar mismatch details to the District Education Officer through the Principal of the concerned school. Director of Government Examinations Mr. D. should be arranged so that student's Aadhaar is properly seeded to the student's bank account and cash is deposited through DBT. Devananda Reddy informed.
03-12-2023 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) లో ఎంపిక అయిన విద్యార్థుల యొక్క మెరిట్ కార్డ్ లు విద్యార్థులకు అందుటలో జాప్యము జరుగుచున్న కారణంగా ఈ సంవత్సరం వెబ్ మెరిట్ కార్డ్ లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంచడమైనది. కావున ఎంపిక అయిన విద్యార్ధులు వెంటనే వెబ్సైట్ నుండి వారి మెరిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుని వారి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా తల్లి పేరు మొదలగు వివరములు వారి ఆధార్ కార్డ్ పైన ఉన్న విధంగానే (ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా) ఉన్నవో లేదో తనిఖీ చేసుకుని విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారి స్కాలర్షిప్ పోర్టల్ www.scholarships.gov.in లో ఈ సంవత్సరం ఆగస్టు 31 లోపు దరఖాస్తు సమర్పించి, సంబంధిత పాఠశాల నోడల్ ఆఫీసర్ మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ లాగిన్ ల ద్వారా అప్రూప్ చేయించుకొనవలెను. ముద్రించిన మెరిట్ కార్డ్ లను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయమునకు పంపడం జరుగుతుంది. విద్యార్ధి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ మెరిట్ కార్డులో ముద్రించబడిన విధంగా మాత్రమే ఆధార్ కార్డ్ లో ఉండవలెను. వివరములు సరిపోలని విద్యార్థులు వెంటనే ఆధార్ mismatch వివరములు సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖాధికారికి అందజేయవలెను. తప్పని సరిగా విద్యార్థి ఆధార్ విద్యార్ధి బ్యాంక్ ఖాతాకు సీడ్ కాబడి, DBT ద్వారా నగదు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ డి. దేవానంద రెడ్డి గారు తెలియజేసారు.
No comments:
Post a Comment