పారిస్ ఒలింపిక్స్ 2024 లో కొత్త చరిత్ర సృష్టించిన మను బాకర్
భారత యువ షూటర్ మను బాకర్ పారిస్ ఒలింపిక్స్లో మరో పతకానికి గురిపెట్టింది. ఇప్పటికే ఒలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన మను మూడో విభాగంలో పోటీపడుతోంది. షూటింగ్ మహిళల 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ పోరులో మొత్తం 590 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఫైనలు దూసుకెళ్లింది.
ఇప్పటికే ఈ ఒలింపిక్స్ లో 2 పతకాలు తన ఖాతాలో వేసుకున్న మను బాకర్ రికార్డ్.
2024 ఒలింపిక్స్ లో భారత్ కు మరో పతకం. కాంస్యం సాధించిన మను బకార్, సరబోజోద్ సింగ్ జోడీ మిక్స్ ఈవెంట్ లో పతకం
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మను బాకర్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాగా, షూటింగ్ తో పాటు మరికొన్ని ఆసక్తి కర పోటీల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారు. రోయింగ్, ఈక్వెస్ట్రియన్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఆర్చరీలో మనోళ్లు రంగంలోకి దిగుతు న్నారు. అలాగే మన హాకీ జట్టు ఐర్లాండ్తో తలపడ నుంది. ఇక ఆర్చరీలో మన తెలుగు తేజం ధీరజ్ బొమ్మదేవర పురుషుల వ్యక్తిగత విభాగంలో పోటీపడనున్నాడు.
No comments:
Post a Comment