Pages

Monday, 2 September 2024

Ramon Magsaysay Awards 2024

Ramon Magsaysay Awards 2024 రామన్ మెగ సెసె అవార్డు 2024


2024 సంవత్సరానికి గానూ ప్రముఖ జపాన్ యానిమేటర్ హయానో మియాజాకీని రామన్ మెగసెసె అవార్డు వరించింది.


ఆయనతో పాటు వియత్నాం డాక్టర్ న్దుయెన్, మాజీ బౌద్ధ సన్యాసి కర్మ ఫుంటా, ఇండోనేషియాకు చెందిన ఫర్వీజీ ఫర్హాను మరియు థాయ్ లాండ్ కు చెందిన రూరల్ డాక్టర్స్ మూమెంట్ సంస్థకు ఈ పురస్కారం దక్కింది.


ఈ ఏడాది నవంబర్లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం అవార్డు నిర్వాహక కమిటీ చేయనుంది.


రామన్ మెగసెసే అవార్డు గురించి:


ఫిలిప్పీన్స్ దివంగత అధ్యక్షుడు రామన్ మెగ సెసే స్మారకార్థం ఈ అవార్డును ఏప్రిల్, 1957లో ఏర్పాటు చేశారు. దీనిని "ఆసియన్ నోబెల్ ప్రైజ్"గా భావిస్తారు.


ఈ అవార్డును 6 విభాగాల్లో 1958 నుంచి 2008వరకు అందజేసేవారు. అయితే, 2009 సంవత్సరం నుండి, రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ పైన పేర్కొన్న ఆరు విభాగాలలో అవార్డును ప్రదానం చేసే పద్ధతిని తొలగించింది.

No comments:

Post a Comment